Governor Tamilisai Soundar Rajan: సమ్మక్క-సారాలమ్మకు గవర్నర్ తమిళిసై నిలువెత్తు బంగారం సమర్పణ !

సమ్మక్క-సారాలమ్మకు గవర్నర్ తమిళిసై నిలువెత్తు బంగారం సమర్పణ !

Governor Tamilisai Soundar Rajan: తెలంగాణా కుంభమేళాగా గుర్తింపుపొందిన మేడారం సమ్మక్క-సారాలమ్మ మహా జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. దేశం నలుమూలల నుండి పెద్దసంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని సమ్మక్క-సారాలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిలో భాగంగా తెలంగాణా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్(Governor Tamilisai Soundar Rajan), కేంద్ర మంత్రి అర్జున్ ముండా శుక్రవారం మేడారం చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి అర్జున్ ముండా నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ… దేశ, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరానని తెలిపారు. ఇది గొప్ప జాతర… గవర్నర్‌ గా నేను మూడోసారి మేడారం జాతరకు రావడం నా అదృష్టం’’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

Governor Tamilisai Soundar Rajan Presents

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ… ఇది దేశంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర. పలు రాష్ట్రాల నుంచి భక్తులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది ఇలా ఉండగా… సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర ప్రాంగణం మార్మోగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటికే గద్దెలపైకి సమక్క సారలమ్మలు చేరుకోవడంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 21 నుంచి జాతర ప్రారంభమవగా… నాలుగు రోజుల పాటు వనదేవతల జాతర జరుగనుంది. తిరిగి అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగియనుంది. దీనితో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు మేడారం జాతరకు పొటెత్తుతున్నారు.

Also Read : Amit Shah Visit : లోక్ సభ ఎన్నికలకు దూకుడు పెంచిన బీజేపీ..తెలంగాణకు రాబోతున్న అమిత్ షా

Leave A Reply

Your Email Id will not be published!