Governor Tamilisai Soundararajan: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం !

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం !

Governor Tamilisai Soundararajan: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్‌ తమిళిసై నిర్ణయించారు. గతంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం… దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణను ప్రతిపాదించింది. అయితే ఆ ఇద్దరికీ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. దీనితో తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్‌ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిపాదనలు తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు… ఆ స్థానాల భర్తీ నిలిపివేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి.

Governor Tamilisai Soundararajan Comment

ఇది ఇలా ఉండగా రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్‌ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్‌ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై నిర్ణయం అటు గత ప్రభుత్వానికి, ఇటు ప్రస్తుత ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా నిలుస్తోంది.

Also Read : Virat Kohli Fans : కోహ్లీకి మైదానంలో హాగ్ ఇచ్చి జైలుకి వెళ్లిన అభిమాని

Leave A Reply

Your Email Id will not be published!