Green Metro Luxury Buses : గ్రీన్ మెట్ర్ లగ్జరీ బస్సులు స్టార్ట్
తొలి విడతగా 25 బస్సులు
Green Metro Luxury Buses : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బుధవారం కొత్తగా హైదరాబాద్ లో 25 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రారంభించింది. మొత్తం 50 బస్సులను నడపాలని నిర్ణయించింది. తొలి విడత కింద 25 బస్సులు రోడ్డు పైకి వచ్చాయి. మిగతా 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు వచ్చే నవంబర్ నెలలో వస్తాయని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
Green Metro Luxury Buses in Telangana
నగర వాసులకు వీటి ద్వారా మరింత ప్రయాణం సుఖంగా , సౌకర్యవంతంగా సాగుతుందని టీఆఎస్ఆర్టీసీ(TSRTC) పేర్కొంది. ఇప్పటికే సంస్థను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిపై గవర్నర్ ఆమోదం తెలిపింది. రాను రాను సామాన్యులు ప్రయాణం చేయకుండా ఉండేందుకే లక్జరీ బస్సులను ప్రవేశ పెట్టారన్న విమర్శలు లేక పోలేదు.
ఆర్టీసీ అన్నది ప్రజలకు చెందిన సంస్థ. దానిని కేవలం ఐటీకో లేదా ఇతర కంపెనీలకు, భారీ ఆదాయం కలిగిన వారు ప్రయాణం చేసేలా ఛార్జీలు వడ్డించడం ఎంత వరకు సబబు అంటూ నిలదీస్తున్నారు ప్రయాణీకులు. మొత్తంగా బస్సుల రాకతో సంస్థపై అదనపు భారం పడడం తప్ప ఇంకేమీ ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇకనైనా సంస్థ ఎండీ , ప్రభుత్వం సామాన్యులు ప్రయాణం చేసేందుకు అదనపు బస్సులు వేస్తే బాగుంటుంది.
Also Read : AP CM YS Jagan : దసరా నుంచి విశాఖ వేదికగా పాలన