Greg Barclay : ఐసీసీ చైర్మన్ గా మరోసారి ఎన్నికైన బార్క్
జే షా కు ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల చీఫ్
Greg Barclay : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బాస్ ఎవరన్నది తేలి పోయింది. ఇప్పటి వరకు సౌరవ్ గంగూలీ అవుతాడని అంతా భావించారు. కానీ కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు బీసీసీఐ కార్యదర్శి జే షా చక్రం తిప్పడంతో కోలుకోలేని షాక్ తగిలింది దాదాకు. దీంతో ఐసీసీ రేసులో బరిలో ఉండాలంటే బీసీసీఐ సిఫారసు చేయాల్సి ఉంది.
కానీ గంగూలీకి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఐసీసీ రేసులో పోటీ లేకుండా పోయింది. బీసీసీఐ బాస్ గా ఉండాలని ముందుగా భావించాడు గంగూలీ. కానీ దానికి ఎసరు పెట్టాడు జే షా. అక్కడి నుంచి ఐపీఎల్ చైర్మన్ పదవి ఇస్తామన్నారు. కానీ దానిని సున్నితంగా తిరస్కరించాడు గంగూలీ. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది.
టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఏకంగా ఐసీసీకి రెఫర్ చేయాలంటూ పీఎం మోదీకి లేఖ కూడా రాసింది. కానీ ఫలితం లేకుండా పోయింది. జే షా తెర వెనుక నుంచి చక్రం తిప్పాడని ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు బీసీసీఐ అనేది క్రీడా సంస్థ కాదు పొలిటికల్ లీడర్లకు కేరాఫ్ గా మారిందన్న విమర్శలు లేక పోలేదు.
ఈ తరుణంలో ఐసీసీ చైర్మన్ గా మళ్లీ న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్కేనే ఎన్నికయ్యాడు. ఇక బీసీసీఐ కార్యదర్శి జే షా ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీకి చైర్మన్ గా ఎంపిక కావడం విశేషం. మొత్తంగా గంగూలీ వ్యవహారం ఇంతటితో క్లోజ్ అయినట్టు భావించక తప్పదు.
ఇదిలా ఉండగా తెవెంగ్వా ముకుహ్లానీ ఆ పోటీ నుంచి తప్పు కోవడంతో గ్రెగ్ బార్కేకు(Greg Barclay) లైన్ క్లియర్ అయ్యింది. రెండేళ్ల పాటు చైర్మన్ గా కొనసాగుతారు. బీసీసీఐ కార్యదర్శి జే షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు చైర్మన్ గా ఉన్నారు.
Also Read : రాహుల్ ద్రవిడ్ కు మరొకరు కావాలి – భజ్జీ