Greg Chappell Gill : గిల్ పై చాపెల్ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ లో తోపు అయితే ఇక్కట్లు తప్పవు
Greg Chappell Gill : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఒకప్పటి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్(Greg Chappell) షాకింగ్ కామెంట్స్ చేశాడు. జూన్ 7 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రపంచ క్రికెట్ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యం లోని భారత జట్టు ఆస్ట్రేలియా టీమ్ తో తలపడనుంది. ఈ సందర్భంగా ఎవరు గెలుస్తారనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశాడు గ్రెగ్ చాపెల్.
లండన్ లోని ఓవెల్ మైదానంలో ఈ కీలక ఫైనల్ మ్యాచ్ కు వేదిక కానుంది. ఈ సందర్భంగా తాజాగా భారత్ లో జరిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడిన శుభ్ మన్ గిల్ దుమ్ము రేపాడు. ఏకంగా 809 పరుగులతో టాప్ లో నిలిచాడు.
టోర్నీలో భాగంగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కాగా గిల్ తో పాటు అజింక్యా రహానే కూడా దుమ్ము రేపాడు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిల్ తో పాటు రహానేను ఎంపిక చేసింది ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం. ఇద్దరూ దుమ్ము రేపారు. విచిత్రం ఏమిటంటే రన్నరప్ గా నిలిచిన జట్టులో శుభ్ మన్ గిల్ ఉండగా ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అజింక్యా రహానే ఉన్నాడు.
శుభ్ మన్ గిల్ ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు గ్రెగ్ చాపెల్. గిల్ తోపు క్రికెటర్ కావచ్చు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి తట్టుకుని నిలబడటం చాలా కష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుతం గ్రెగ్ చాపెల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Chandrababu Naidu