Group-2 Exams Postponed : గ్రూప్-2 పరీక్షలు వాయిదా
ప్రకటించిన టీఎస్పీఎస్సీ
Group-2 Exams : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రకటించిన గ్రూప్-2 పరీక్షలపై నెలకొన్న సందిగ్ధతకు తెర పడింది. ఈ ఏడాది జనవరి 6,7 తేదీలలో గ్రూప్ -2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో లీకేజీల పర్వం కొనసాగింది. పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ సిట్ ను విచారణకు ఆదేశించింది.
Group-2 Exams Postponed Again
చివరకు పరీక్షలు నిర్వహించేందుకు గాను టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసినా రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు కూడా స్వచ్చందంగా రాజీనామా చేశారు. దీంతో కమిషన్ ప్రస్తుతం కార్యదర్శి అనితా రామ చంద్రన్ ఆధ్వర్యంలో నడుస్తోంది.
చైర్మన్, సభ్యుల రాజీనామాలను నేరుగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundararajan) కు సమర్పించారు. వాటిని ఇప్పటి వరకు ఆమోదించలేదు. దీంతో గ్రూప్ -2 పరీక్షలు ఆగి పోతాయని నిరుద్యోగులు ఆశించారు. వారు కోరుకున్నదే జరిగింది. వచ్చే ఏడాది పూర్తయ్యే లాగా ఇప్పటి వరకు ప్రకటించిన 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
తాజాగా టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.
Also Read : Congress Praja Palana : నేటి నుంచి ప్రజా పాలన