Nirmala Sitharaman : ప్యాకింగ్ ఫుడ్స్ పై జీఎస్టీ అవ‌స‌రం – నిర్మ‌లా

చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన ఆర్థిక మంత్రి

Nirmala Sitharaman : దేశ ఆర్థిక ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోంది. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్మ‌కానికి పెట్ట‌డం లేదా లీజుకు ఇవ్వ‌డ‌మో చేస్తూ వ‌స్తున్న బీజేపీ ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రి ఉన్న‌ట్టా లేనట్టా అన్న అనుమానం క‌లుగుతోందంటున్నాయి ప్ర‌తిప‌క్షాలు.

ప్ర‌ధానంగా అన్నింటి నిత్యావస‌ర వ‌స్తువుల‌పై జీఎస్టీ పేరుతో మోత మోగించ‌డం నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) కు ఓ అల‌వాటుగా మారిన‌ట్టుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారి తీశాయి.

ప‌న్ను లీకేజీని అరిక‌ట్టేందుకు ప్యాకేజ్డ్ ఫుడ్ పై 5 శాతం జీఎస్టీ(GST) అవ‌స‌రం అని స్ప‌ష్టం చేసింది ఆర్థిక మంత్రి. ఇదిలా ఉండ‌గా ప్రీ ప్యాక్డ్ ఫుడ్ ఐట‌మ్స పై కేంద్ర స‌ర్కార్ విధించిన జీఎస్టీ జూలై 18 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది.

జీఎస్టీ కౌన్సిల్ ఏక‌గ్రీవంగా నిర్ణ‌యం తీసుకుంద‌ని దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు. తృణ ధాన్యాలు, పప్పు దినుసుల‌తో స‌హా ముంద‌స్తుగా ప్యాక్ చేసిన ఆహార ధాన్యాల‌పై వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ ) విధించే నిర్ణ‌యాన్ని ఆయా రాష్ట్రాల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు చెప్పారు.

జీఎస్టీకి ముందు కాలంలో రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్ ) వ‌సూలు చేసే వార‌ని ఆహార ధాన్యాల‌పై ప‌న్ను విధించ‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని నిర్మలా సీతారామ‌న్ వ‌రుస ట్వీట్ల‌తో స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రాలు ఆహార ధాన్యాల నుండి గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని సేక‌రిస్తున్నాయ‌ని తెలిపారు. ఒక్క పంజాబ్ కొనుగోలు ప‌న్ను ద్వారా ఆహార ధాన్యాంపై రూ. 2,000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింద‌న్నారు.

యూపీ రూ. 700 కోట్లు వ‌సూలు చేసింద‌ని వెల్ల‌డించారు. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై వ్యాపార‌వేత్త‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

Also Read : మ‌రోసారి డీలా ప‌డిన రూపాయి

 

 

Leave A Reply

Your Email Id will not be published!