Devendra Fadnavis : గుజరాత్ పాకిస్తాన్ కాదు – ఫడ్నవీస్
డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్
Devendra Fadnavis : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రకు రావాల్సిన చిప్ ప్లాంట్ కంపెనీ గుజరాత్ కు తరలి పోవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది.
ప్రధానంగా శివసేన మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలేతో పాటు కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగారు.
సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ల నిర్వాకం, చేతకాని తనం వల్ల రాష్ట్రానికి రావాల్సిన చిప్ ప్లాంట్ కంపెనీని వేదాంత , ఫాక్స్ కాన్ కంపెనీ కావాలని గుజరాత్ లో ఏర్పాటు చేస్తున్నారంటూ ఆరోపించారు.
దీనిపై పెద్ద ఎత్తున మరాఠాలో ఆందోళన వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితి సీఎం , డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారు. సీఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారు.
దీంతో చిప్ ప్లాంట్ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేలా మరో కంపెనీ ఏర్పాటు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారని షిండే వెల్లడించారు.
ఈ తరుణంలో చిప్ ప్లాంట్ కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున రాద్దాంతం చెలరేగడంతో స్వయంగా వేదాంత కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు తమకు ఒక్కటేనని పేర్కొన్నారు. తమ కంపెనీకి సంబంధించిన నిపుణులు సూచించిన మేరకే తాము గుజరాత్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మరో $20 బిలియన్లతో కొత్త ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గుజరాత్ భారత దేశంలో ఒక భాగమని అదేం పాకిస్తాన్ లో లేదన్నారు.
Also Read : మోదీ జీవితం నిబద్దతకు నిదర్శనం