Gujarat Riots : మోదీకి వ్యతిరేకంగా ‘పటేల్’ కుట్ర – సిట్
వెల్లడించిన గుజరాత్ దర్యాప్తు బృందం
Gujarat Riots : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ దివంగత నాయకుడు అహ్మద్ పటేల్ కు కోలుకోలేని షాక్ తగిలింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో ఆనాటి సీఎం, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో అహ్మద్ పటేల్ పాత్ర ఉందంటూ దర్యాప్తు బృందం (సిట్ ) స్పష్టం చేసింది.
దివంగత నాయకుడి సూచన మేరకే ఈ ఘటన చోటు చేసుకుందని సిట్ పేర్కొంది. 2002లో గోద్రా అనంతర అల్లర్ల తర్వాత పటేల్ ఆదేశాలతో సెతల్వాద్ రూ. 30 లక్షలు తీసుకుందని ఆరోపించింది.
కావాలనే కుట్ర పన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది దర్యాప్తు సంస్థ. పటేల్ పన్నిన పెద్ద కుట్రలో ఆమె కీలక భాగస్వామిగా ఉన్నారంటూ స్పష్టం చేసింది.
సిట్ సమర్పించిన నివేదిక మేరకు ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్ బెయిల్ దరఖాస్తును గుజరాత్ పోలీసులు వ్యతిరేకించారు. 2002 గుజరాత్ అల్లర్లకు(Gujarat Riots) సంబంధించి ప్రజలను తప్పుగా ఇరికించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఇటీవలే అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులలో సెతల్వాద్ ఒకరు.
సెషన్స్ కోర్టు ముందు పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ వివరాలను పేర్కొన్నారు. అదనపు సెషన్స్ జడ్జి డీడి ఠక్కర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లేదా సిట్ ఇచ్చిన సమాధానాన్ని రికార్డ్ చేయాలని ఆదేశించారు.
బెయిల్ దరఖాస్తుపై విచారణను సోమవారానికి మార్చారు. ఈ పెద్ద కుట్రను అమలు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారు సెతల్వాద్ రాజకీయ లక్ష్యం ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగిండచం లేదా అస్థిర పర్చడమేనని సిట్ స్పష్టం చేసింది.
Also Read : విజయ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు