GT vs CSG IPL 2022 : హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చెప్పినట్లే చేశాడు. తాము సత్తా చాటడం ఖాయమని ప్రకటించినట్లు గానే లక్నో సెయింట్ జెయింట్స్(GT vs CSG) పై గుజరాత్ టైటాన్స్ (The Gujarat Titans) ఐపీఎల్ రిచ్ లీగ్ లో శుభారంభం చేసింది.
ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు విజయం సాధించింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) చెలరేగాడు. లయన్స్ జట్టును కోలుకోలేకుండా చేశాడు. బౌలర్ గా షమీ సత్తా చాటితే రాహుల్ తెవాటియా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు.
ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ముందుగా లంక సెయింట్స్ జెయింట్స్ బ్యాటింగ్ కు దిగింది. షమీ దెబ్బకు స్టార్ ప్లేయర్లు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు.
వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో కష్టాల్లో ఉన్న ఆ జట్టును ఆయుశ్ బదోని, దీపక్ హూడా (Deepak Hooda) ఆదుకున్నారు. దీంతో 20 ఓవర్లలో లంక సెయింట్స్ జెయింట్స్ గౌర ప్రదమైన స్కోర్ చేసింది.
6 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేస్తే హూడా 41 బంతులు ఆడి 6 ఫోర్లు 2 సిక్స్ లతో 55 పరుగులు చేశాడు. బదోని 41 బంతులు ఆడి 4 ఫోర్లు ఓ సిక్స్ తో 54 రన్స్ చేశాడు.
అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ (The Gujarat Titans) 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది. తెవాటియా 24 బంతులు ఆడి 5 ఫోర్లు 2 సిక్స్ లతో రెచ్చి పోయాడు.
40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ ఓ ఫోర్ 2 సిక్సర్లతో 30 రన్స్ చేశాడు. ఇక లక్నో విజయం కోసం చివరి దాకా పోరాడింది. గుజరాత్ ను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. కానీ తెవాటియా, మిల్లర్ లు వారి ఆశలపై నీళ్లు చల్లారు.
Also Read : రిటైర్మెంట్ పై మిథాలీ రాజ్ కామెంట్