Guvvala Bala Raju: బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా

బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా

Guvvala Bala Raju : బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. మరోవైపు బాలరాజుతో పాటుగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. గువ్వల బాలరాజు 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీనితో నాటి నుంచి పార్టీలో ఇన్‌ యాక్టీవ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజ్ భేటీ అయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కాగా, బాలరాజు (Guvvala Bala Raju) త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

Guvvala Bala Raju – కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా – గువ్వల బాలరాజు షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్‌పై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Bala Raju) షాకింగ్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని విమర్శించారు. బీఆర్ఎస్‌లో పరిణామాలు చూస్తుంటే పొత్తు పెట్టుకున్నా అశ్చర్యం లేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్, బీజేపీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత లాంటి నేతలు కూడా చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌లో తనకు భవిష్యత్తు లేదనే అసంతృప్తితోనే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్‌లోకి వచ్చిన మాట వాస్తవమని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఎల్ సంతోష్‌ ను తాను ఎప్పుడూ విమర్శించలేదని గువ్వాల బాలరాజు పేర్కొన్నారు.

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను మాత్రమే తాను పూర్తి చేశానని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకత్వం.. ప్రజల్లో బలం లేని రెడీమేడ్ లీడర్స్‌ను నమ్ముకుంటుందని వ్యాఖ్యానించారు. జనరల్ నియోజకవర్గాల్లో దళితులకు సీట్లు ఇచ్చే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గించారని గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

గువ్వల బాల రాజు ఫోన్ కాల్ వైరల్ !

గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కార్యకర్తతో మాట్లాడినట్లుగా ఓ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. ఈ ఫోన్ కాల్‌లో ఏం మాట్లాడరంటే.. ‘బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని లేదా విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మన అభ్యర్థిత్వం ఎగిరిపోతుంది. గతంలో బీజేపీతో తాను పోరాటం చేశా. బీఆర్ఎస్ కంటే ముందే తన దారి తాను చూసుకుని… బీజేపీలో కలవడం మంచిదని నిర్ణయం తీసుకున్నా. పార్టీలో తనను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇచ్చారు… ఆ విషయం తనను బాధించింది’ అని గువ్వల బాలరాజు మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read : Donald Trump: భారత్‌ పై రెచ్చిపోయిన ట్రంప్‌

Leave A Reply

Your Email Id will not be published!