MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ! 

వైసీపీ ఎంపీ విజయసాయి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ! 

MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు ప్రారంభించింది. భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేహారెడ్డి చేపట్టిన ప్రహరీ గోడపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా బీచ్‌ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో నేహా రెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని… లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. అయితే జీవిఎంసీ నోటీసులకు నేహారెడ్డి స్పందించలేదు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.

MP Vijayasai Reddy…

విశాఖ జిల్లా భీమిలి బీచ్‌ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలను ఉల్లంఘించి నేహారెడ్డి కాంక్రీట్ గోడను నిర్మించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిల్ వేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కూల్చివేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ స్థాయి నివేదికను సమర్పించాలని గత నెలలో హైకోర్టు నిర్దేశించి ఆపై తదుపరి విచారణను సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. భీమిలి బీచ్‌ సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ తరఫున న్యాయవాది పొన్నాడ శ్రీవ్యాస్‌ వాదనలు వినిపించారు.

Also Read : JCB Driver Subhan: మున్నేరు వాగులో చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడిన పొక్లెయిన్‌ డ్రైవర్‌ సుభానీ !

Leave A Reply

Your Email Id will not be published!