Supreme Court : వారణాసి కోర్టు విచారణపై స్టే
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
Supreme Court : దేశ వ్యాప్తంగా యూపీలోని జ్ఞాన వాపి మసీదు సర్వే వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం(Supreme Court).
ఈ వివాదంపై వారాణాసి జిల్లా కోర్టు విచారణను నిలుపుదల చేసింది కోర్టు. ఈ వ్యవహారంపై తామే విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ఈనెల 20న మధ్యాహ్నం మసీదు సర్వే కేసు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే స్థానిక సిటీ కోర్టు ఆదేశించిన మేరకు అక్కడ సర్వే చేపట్టారు. ఇంకా నివేదిక అంద చేయలేదు.
కొంత సమయం కావాలని అడగడంతో రెండు రోజుల గడువు ఇచ్చింది కోర్టు. దీనిని సవాల్ చేస్తూ ముస్లిం కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
విచారణపై స్టే ఇచ్చింది. జ్ఞాన వాపి మసీదు సర్వే నివేదికలోని అంశాలను బయట పెట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈనెల 14 నుంచి 16 వరకు మసీదులో సర్వే చేపట్టారు.
సర్వే జరుగుతున్న సమయంలోనే మసీదు ప్రాంగణంలో శివ లింగగం ఒకటి బయట పడిందంటూ హిందూ వర్గాలు ప్రకటించాయి. ఇది కలకలం రేపింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి ముస్లిం వర్గాలు.
అది శివ లింగం కాదని ఫౌంటెన్ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు పరిస్థితి తీవ్రతను గమనించిన కోర్టు ఆ ప్రాంతాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది. చివరకు సమయం కోరిన సర్వే బృందం పూర్తి నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టు(Supreme Court) ముందుంచింది.
నివేదిక, వీడియో చిప్ ను సీల్డ్ కవర్ లో అందించారు. 15 పేజీల దాకా నివేదిక ఉందని సమాచారం. కాగా విచారణ చేపట్టాల్సి ఉండగా లాయర్ల సమ్మె కారణంగా వాయిదా పడింది. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తామే తీర్పు చెబుతామంటూ స్పష్టం చేసింది.
Also Read : బీజేపీలో చేరడంపై పటేల్ కామెంట్