Harish Rao: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే… రేవంత్ రెడ్డి కుర్చీ నుంచి దిగిపోడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే… నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రికార్డ్ మెజారిటీతో గెలవనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని హరీష్ రావు (Harish Rao) సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించమంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నిర్వహిస్తే.. రేవంత్ రెడ్డిని గల్లా పట్టుకుని నిలదీస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్. మందిని ముంచి రేవంత్ రెడ్డి వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు వేల రూపాయలు ఇవ్వబోతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంత ఇచ్చినా తీసుకుని.. ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని హరీష్ రావు పేర్కొన్నారు.
Harish Rao – జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నలుగురి పేర్లతో కాంగ్రెస్ జాబితా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసింది. నలుగురి పేర్లతో జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. షార్ట్ లిస్టులో నవీన్‌యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి పంపనుంది. ఈ జాబితాను పరిశీలించి… జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించనుంది. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క దిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం వెళ్లనున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కేసు దృష్ట్యా ఈ నేతల దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలోని సీనియర్ న్యాయవాదులను కలిసి.. బలమైన వాదనలు వినిపించేలా వారితో చర్చించనున్నట్లు సమాచారం.
Also Read : KTR: బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ఆగ్రహం
