Harish Rao : హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని అన్నారు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ ఛానల్ తో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
Harish Rao – Kaleshwaram Rumour False
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలుసు కోకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు . కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌస్ లు, 204 కిలోమీటర్ల భూగర్భ టన్నెళ్లు, 98 కిలోమీటర్ల మేర విస్తరించి ఉందన్నారు . 1500 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువలు ఉన్నాయని తెలిపారు హరీశ్ రావు.
దీని గురించి ఆలోచించే తీరిక లేని నాయకులంతా దానిపై ఏదో తెలిసినట్టు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు . డిసెంబర్ 3న చరిత్ర తిరగ రాస్తున్నామని చెప్పారు హరీష్ రావు(Harish Rao). కేసీఆర్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి మళ్లీ అధికారంలోకి వస్తున్నామని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్ని ప్రశ్నలు వేసినా ఎదుర్కొనేందుకు , చెప్పేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు మంత్రి.
Also Read : Nara Lokesh : నిధుల జాప్యం పేదలకు శాపం
