Harish Rao : రేవంత్..కిషన్ రెడ్డి తెలంగాణ ద్రోహులు
మంత్రి తన్నీరు హరీశ్ రావు
Harish Rao : హైదరాబాద్ – ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇద్దరూ దొంగలేనని పేర్కొన్నారు.
Harish Rao Slams Revanth Reddy and Kishan Reddy
ఒకడేమో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టాడని ఆరోపించారు. ఇంకోడేమో ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే వెన్ను చూపి పారి పోయాడంటూ ఎద్దేవా చేశారు.
ఇంత మంది వెను దిరిగినా ఒకే ఒక్కడు చివరి దాకా నిలబడిన ఏకైక నాయకుడు, ధీరోదాత్తుడు, తెలంగాణ స్పూర్తి ప్రదాత ఒకే ఒక్కడు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు హరీశ్ రావు(Harish Rao). ఆదివారం ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ఇద్దరి మధ్య పోటీ నెలకొందన్నారు. ఆ పోటీ ఏమిటంటే రానే రాదు అన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒక వైపు ..పదవుల కోసం పాకు లాడిన తెలంగాణ ద్రోహులు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇంకో వైపు ఉన్నారని మండిపడ్డారు హరీశ్ రావు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని జోష్యం చెప్పారు. మన సంఖ్య 100 సీట్లను దాటుతాయని ఆ నమ్మకం తనకు ఉందన్నారు హరీశ్ రావు.
Also Read : BRS WIN 2023 : బీఆర్ఎస్ అడ్డా గులాబీదే జెండా