Khashoggi’s Fiancee : రక్తంతో తడిసిన చేతులతో కరచాలనమా
బైడెన్ పై నిప్పులు చెరిగిన ఖషోగ్గీ భార్య
Khashoggi’s Fiancee : ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్ట్ ఖషోగ్గీ దారుణ హత్య సంచలనం కలిగించింది అప్పట్లో. అతడితో పాటు సౌదీ అరేబియాలో ఎందరో చిరునామా లేకుండా చావుకు గురయ్యారని దీని వెనుక సౌదీ ప్రిన్స్ హస్తం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం అమెరికా దేశ అధ్యక్షుడు బైడెన్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో హత్యకు గురైన ఖషోగ్గీ విషయంలో అమెరికా చీఫ్ పై నిప్పులు చెరిగింది జమాల్ ఖషోగ్గీ.
ది వాషింగ్టన్ పోస్ట్ లో క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ను విమర్శిస్తూ రాసిన సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీని 2018 అక్టోబర్ లో గొంతు కోసి చంపి, ఛిద్రం చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తదుపరి బాధితుడి రక్తం మీ చేతుల్లో ఉందంటూ ట్వీట్ చేసింది జమాల్ ఖషోగ్గీ భార్య(Khashoggi’s Fiancee). జర్నలిస్ట్ హత్యకు ఆదేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అమెరికా చీఫ్ పిడికిలితో కొట్టడం దేనికి సంకేతమంటూ ప్రశ్నించింది.
మరింత మందిని చంపేందుకు లేదా చంపించేందుకు అతడికి లైన్ క్లియర్ ఇచ్చినట్టేనని పేర్కొంది. ఇందుకు గాను జోసెఫ్ బైడెన్ వీలు కల్పించారంటూ ఆరోపించింది.
ఇది జమాల్ ఖషోగ్గీ తో సరి పోయిందనుకుంటే పొరపాటు పడినట్లే ఇంకా ఎందరో అకృత్యాలకు, అరాచకాలకు బలై పోయిన వారున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టర్కిష్ కు చెందిన సెంగిజ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు జమాల్ ఖషోగ్గీ. దీనిని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణకర్త, సిఇఓ ఫ్రెడ్ ర్యాన్ తీవ్రంగా తప్పు పట్టారు.
Also Read : సౌదీలో హక్కుల ఉల్లంఘనపై ఆందోళన