Indian Women Team : యావత్ క్రీడా లోకం విస్తు పోయిన క్షణాలు అవి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మహిళా వన్డే వరల్డ్ కప్ 2022 లో భాగంగా భారత మహిళా జట్టు దేశం గర్వ పడేలా ఆడింది. చివరి వరకు పోరాటం సాగించిన తీరు ఆద్యంతమూ ఆకట్టుకుంది.
ఇవాళ క్రైస్ట్ చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో సెమీ ఫైనల్ కోసం జరిగిన మ్యాచ్ లో భారత మహిళలు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. చివరి బంతి వరకు సాగించిన పోరాటం మాటల్లో వర్ణించలేం.
మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్ నభూతో(Indian Women Team) నభవిష్యత్ అన్న రీతిలో ఆట తీరుతో ఆకట్టుకున్నారు. భారీ స్కోర్ ప్రత్యర్థి జట్టు ముందుంచారు.
ఇక హర్మన్ ప్రీత్ కౌర్ 48 పరుగులతో రాణించడమే కాదు అద్భుతమైన రనౌట్ చేసింది. బౌలింగ్ తో దుమ్ము రేపింది. కానీ అనుకోని రీతిలో ఆఖరు బంతికి ఒక పరుగు చేసి సఫారీ జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసింది.
ఆట పరంగా సఫారీ గెలిచి ఉండి ఉండవచ్చు. కానీ క్రీడాభిమానులను, కోట్లాది మంది భారతీయుల గుండెల్ని మీటిన ఘనత మాత్రం భారత మహిళల జట్టుదేనని చెప్పక తప్పదు. గెలుపు ఓటములు ఆట అన్నాక సహజం.
కానీ ఇలాంటి మ్యాచ్ లు క్రీడా స్ఫూర్తిని, ప్రతిభా పాటవాలను తెలియ చేస్తుంది. ఈరోజు వాళ్లది కావచ్చు. కానీ రేపటి రోజు మాత్రం మనదే అవుతుంది.
Also Read : భారత్ ను ముంచిన నో బాల్