Sorghum : మారుతున్నా జీవనశైలి, కాలుష్యం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వయసుతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరు ఏదోఒక సమస్యతో బాధపడుతున్నారు. ముక్కయంగా ఊబకాయ సమస్య చాలామందిని వేధిస్తుంది. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే ప్రకృతి ప్రసాదించిన అనేక రకాల ఆహార పదార్దాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తృణ ధాన్యాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
తృణ ధాన్యాలలో చెప్పుకోదగినవి జొన్నలు. ఈ మధ్య జొన్నలను విరివిగా వాడుతున్నారు. పీచు పదార్థాలు అధికంగా ఉండే జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా జొన్నలు అధికంగా పండుతాయి. గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత అధికంగా పండే పంట జొన్న. జొన్న అన్నం రుచి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చేమో గానీ.. పాతకాలం వారికి మాత్రం అదో మరచిపోలేని జ్ఞాపకమే.
పాస్పరస్, మాంగనీస్, కాపర్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి రకరకాల పోషకాలు జొన్నల్లో సమృద్దిగా ఉన్నాయి. జొన్నలలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి తోడ్పడుతుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్ వంటి వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి.
జొన్నలను ఎక్కువగా తీసుకునే వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. జొన్నలు కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాయి. వీటిలో విటమిన్ బీ6 అధికంగా ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన ఆహారపదార్థాలు పెట్టడం ఎంతో మంచిది.
No comment allowed please