Health Funds Stopped : పంజాబ్ కు నిధులు నిలిపి వేత
సీఎం భగవంత్ మాన్ కు బిగ్ షాక్
Health Funds Stopped : ఆప్ వర్సెస్ కేంద్రం నడుస్తోంది. తాజాగా రెండు రాష్ట్రాలలో కొలువు తీరింది ఆప్. మరో వైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పాగా వేసింది. అయితే ఇంకా మేయర్ ఎన్నిక కాలేదు. ఈ తరుణంలో పంజాబ్ లో కొలువు తీరిన భగవంత్ మాన్ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆరోగ్య శాఖా పరంగా రాష్ట్రానికి ఇచ్చే నిధులను(Health Funds) నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఆరోగ్య సంరక్షణ కేంద్రాల కోసం ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రాలకు ఇచ్చే నిధులను పంజాబ్ కు విడుదల చేయడం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. ఎందుకంటే ఆప్ పంజాబ్ సర్కార్ కావాలని ఈ పథకం పేరును మార్చిందంటూ ఆరోపించింది.
దేశ వ్యాప్తంగా ఆరోగ్య పథకం కోసం పంజాబ్ కు నిధులు నిలిపి వేస్తూ(Health Funds Stopped) కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ, అరవింద్ కేజ్రీవాల్ ఆప్ మధ్య తదుపరి ఘర్షణకు దారి తీసేలా చేసింది.
ఆప్ ప్రభుత్వం కావాలని పథకం పేరుతో , బ్రాండింగ్ ను కూడా మారుస్తోదని ధ్వజమెత్తింది కేంద్రం. ఈ పథకం కింద ఇప్పటికే నిధులు ఇవ్వడం జరిగింది. స్కీం లేక పోతే డబ్బులు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. బ్రాండ్ తో పాటు పథకాన్ని కూడా మారిస్తే ఎలా అని ప్రశ్నించింది. అవగాహన ఒప్పంద నిబంధనల నుండి తప్పుకోవడం సరికాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంజాబ్ సర్కార్ కు లేఖ రాసింది.
Also Read : ప్రజాస్వామ్యానికి మోదీ పాతర – రాహుల్