Heart Attack: గుండెపోటుకు వ్యాక్సిన్ కనుగొన్న చైనా !
గుండెపోటుకు వ్యాక్సిన్ కనుగొన్న చైనా !
Heart Attack : ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జబ్బు గుండెపోటు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. శారీరకంగా ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నప్పటికీ ఏ సమయంలో ఈ గుండె పోటు ప్రాణాలను బలితీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తరువాత ఫిజికల్ ఫిట్ నెస్ తో గుండెపోటుకు సంబంధం లేదని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గుండెపోటు నివారణకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలను జరుగుతున్నాయి.
Heart Attack Vaccine Invented China
ఈ నేపథ్యంలో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించడానికి చైనా(China) వ్యాక్సిన్‌ను రూపొందించింది. రక్తనాళాలు గట్టిపడడం, రక్తవాహికల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడానికి కారణమయ్యే ‘ప్లేక్స్’ ఏర్పడడాన్ని ఈ నానో వ్యాక్సిన్ నిరోధిస్తుంది. నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ‘కాక్‌టైల్’ రూపంలో ఈ నానో వ్యాక్సిన్‌ను రూపొందించాయి. రక్తనాళాలు పెళుసుబారకుండా, వాహికల్లో కొవ్వు పొరలు (ప్లేక్స్) ఏర్పడకుండా అనేక ప్రొటీన్లు పనిచేస్తున్నాయన్న పూర్వ పరిశోధనా ఫలితాలు తాజా రూపకల్పనకు స్ఫూర్తి. అలా పనిచేసే వాటిలో పీ210 కారకం ఒకటి. దీనిని ఐరన్ ఆక్సైడ్ నానోపార్టికల్స్‌కు జత చేశారు. ఇలా తయారుచేసిన వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని మరింత పెంచడానికి ఒక ఉత్ర్పేరకాన్ని వాడారు. దీనిని తొలిదశలో ఎలుకలపై ప్రయోగించినప్పుడు చక్కటి ఫలితాలు వచ్చాయి.
Also Read : QS Rankings: ప్రపంచ టాప్-50 జాబితాలో 9 భారతీయ విద్యా సంస్థలు