Nissan Magnite : నిస్సాన్ ఆ పేరు తలుచుకుంటేనే వాహనదారులకు గుర్తుకు వచ్చేది కార్లే. కళ్లు చెదిరే డిజైన్లతో ఇతర ఆటోమొబైల్ కంపెనీలతో పోటీ పడుతోంది ఈ జపాన్ దిగ్గజ కంపెనీ.
తాజాగా ఈ కంపెనీ నుంచి మాగ్నైట్ పేరుతో ఓ కారు మోడల్ ను విడుదల చేసింది. ఇదా మాగ్నైట్(Nissan Magnite) సబ్ కాంపాక్ట్ ఎస్ యూ వీ మోడల్ కారు. ఊహించని రీతిలో ఈ కారు కోసం హెవీ డిమాండ్ ఉంటోంది.
గత ఏడాది ఈ కారు మోడల్ ను నిస్సాన్ ఇండియా ఆవిష్కరించింది. ఇక అప్పటి నుంచి నేటి దాకా తమకు కావాలంటూ లెక్కలేనన్ని వినతలు వస్తున్నాయి.
ధర ఎంతైనా పర్వాలేదు ఈ మోడలే కావాలంటూ గోల గోల చేస్తున్నారు వాహనప్రియులు. అప్పటి నుంచి నేటి దాకా 40 వేల కార్లు బుక్ కావడం విచిత్రం.
ఈ కారు మోడల్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చిన వెంటనే 5 వేలకు పైగా కార్లు బుక్ చేసుకున్నారు వాహనదారులు.
ఒక్క గత జనవరి నెలలోనే ఏకంగా 32 వేల 800 కార్లు బుక్ అయినట్లు నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. వాస్తవమేనని, అయితే తాము కూడా ఈ మాగ్నైట్ కు ఇంతలా జనం ఫిదా అవుతారని అనుకోలేదన్నారు.
ఓ వైపు మారుతీ సుజుకీ, టాటా, మహీంద్రా, హూంద్యాయ్ , వోక్స్ వాగాన్ తదితర కంపెనీలన్నీ మార్కెట్ ను శాసిస్తున్నాయి.
ఈ క్రమంలో నిస్సాన్ సైతం మెల మెల్లగా తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతోంది.
వినియోగదారులంతా కొత్తగా తమ కారు కోసం వేచి చూస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
బుక్ చేసుకున్న వారుండే ప్లేస్, కొనుగోలు చేసిన వేరియంట్ మోడల్ కారు, వాటి డెలివరీ కోసం ఇంకా ఆరు నెలల దాకా వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
వెయిటింగ్ ఓకే కానీ తమకు మాగ్నైట్ కారే కావాలంటూ కోరడం విశేషం.
ఇదిలా ఉండగా ఊహించని డిమాండ్ పెరగడంతో తమిళనాడులోని ఒరగాడం ప్లాంట్ లో మూడో షిఫ్ట్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
No comment allowed please