TTD Devotees : తిరుమలలో భక్తుల కిటకిట
దర్శనానికి 12 గంటల సమయం
TTD Devotees : వేసవి సెలవులు ముగుస్తుండడంతో శ్రీవారి, అమ్మ వార్లను దర్శించుకునేందుకు భక్తులు(TTD Devotees) బారులు తీరారు. ఎక్కడ చూసినా తిరుమల భక్తులతో నిండి పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సకల సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే వస్తున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయా కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.
ఇదే సమయంలో కొంత సంయమనం పాటించాలని ఇప్పటికే పలుమార్లు టీటీటీ ఈవో ధర్మారెడ్డి భక్తులను(TTD Devotees) కోరారు. దళారులను నమ్మవద్దని సూచించారు. ప్రతి ఒక్కరికి స్వామి, అమ్మ వార్లను దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించేలా చేస్తామని స్పష్టం చేశారు.
నిన్నటి దాకా 25 గంటల సమయం పట్టగా ఇవాళ శ్రీవారిని దర్శించుకునేందుకు కనీసం 12 గంటల సమయం పట్టేలా ఉంది. భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది.
ఇదిలా ఉండగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండి పోయాయి. ఇప్పటి వరకు 87 వేల 698 మంది భక్తులు దర్శించుకున్నారు.
48 వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వెల్లడించింది. ఇక భక్తులు స్వామి వారికి ఇష్టంతో సమర్పించిన కానుకుల రూపేణా రూ. 3.88 హుండీకి ఆదాయం లభించిందని తెలిపింది.
కరోనా తర్వాత రెండేళ్ల అనంతరం ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు టీటీడీ ఈవో శ్రీవారి భక్తులకు(TTD Devotees) శుభవార్త చెప్పారు.
ఇక నుంచి కేవలం గంటన్నర లోపే దర్శనం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
Also Read : అమెరికాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు