KTR : వెల్లువ‌లా పెట్టుబ‌డులు వేలాది కొలువులు – కేటీఆర్

ఇన్నోవేష‌న్ ఇండెక్స్ లో 2వ స్థానంలో తెలంగాణ‌

KTR : ఇండియ‌న్ ఇన్నోవేష‌న్ ఇండెక్స్ లో తెలంగాణ రెండ‌వ స్థానంలో నిలిచింద‌ని ఇదంతా ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన న్యూ పాల‌సీ వ‌ల్ల సాధ్య‌మైంద‌న్నారు ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్. స్విట్జ‌ర్లాండ్ లోని దావాస్ లో నాలుగు రోజుల పాటు ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు జ‌రిగింది.

రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్ త‌న బృందంతో పాల్గొన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు, కంపెనీలు, సంస్థ‌లు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ల‌తో స‌మావేశం అయ్యారు కేటీఆర్(KTR).

ఈ సంద‌ర్భంగా 27 వేల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు మంత్రి. టూర్ స‌క్సెస్ అనంత‌రం తెలంగాణ‌లో కొలువు తీరారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడు సంవ‌త్స‌రాల కాలంలో రాష్ట్రానికి పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌స్తున్నాయ‌ని చెప్పారు మంత్రి. భార‌తీయ ఇన్నోవేష‌న్ జాబితాలో మ‌న రాష్ట్రం రెండ‌వ స్థానం చోటు చేసుకోవ‌డం సంతోషం క‌లిగించింద‌న్నారు .

ప్ర‌స్తుతం దేశంలోనే తెలంగాణ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, ఇన్నోవేష‌న్ , స్టార్ట‌ప్ ల‌లో టాప్ లో ఉంద‌న్నారు. ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ మెంట్స్ రావ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేస్తోంద‌న్నారు కేటీఆర్.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అమెజాన్ ఎయిర్ కార్గో విమాన‌మైన ప్రైమ్ ఎయిర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అమెజాన్ టీంను అభినందించారు. సంస్థ‌కు చెందిన బిగ్ క్యాంప‌స్ హైద‌రాబాద్ లోనే ఉంద‌న్నారు కేటీఆర్(KTR). ఇక వెబ్ సర్వీస్ ద్వారా రూ. 36 వేల కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నుంద‌న్నారు.

Also Read : తెలంగాణ‌కు రూ. 21 వేల కోట్లు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!