Heavy Rain AP : భారీ వర్షం అతలాకుతలం
అట్టుడుకుతున్న ఏపీ, తమిళనాడు
Heavy Rain AP : అమరావతి – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావానికి తమిళనాడు, అమరావతి రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసినా వర్షాలు కుండ పోతగా కురుస్తున్నాయి. చెన్నై వణుకుతోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలపై అత్యధిక ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు జిల్లాలలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
Heavy Rain AP Stagnant water
ఇక సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతూ వచ్చిన తిరుమల వర్షంలో తడిసి ముద్దయింది. తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులు రాకుండా ఆంక్షలు విధించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) .
కేవలం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకే అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. కొండ చరియలు విరిగి పడడం, పొగ మంచు వల్ల రహదారి కనిపించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.
తుపాను తీవ్ర ప్రభావంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమీక్షించారు. సహాయక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక చెన్నై పూర్తిగా నీటిలో తడిసి ముద్దయింది. ఇక ఏపీలోని 9 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.
Also Read : Barrelakka : బరా బర్ బరిలో ఉంటా