Heavy Rains AP : గోదారమ్మ ఉగ్ర రూపం జనం అస్తవ్యస్తం
తాజా పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఆరా
Heavy Rains AP : నైరుతి రుతుపవనాల తాకిడికి ఇరు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
తెలంగాణను వరద ముంచెత్తితే ఏపీలో గోదావరమ్మ ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తున వస్తున్న వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ధవళేశ్వరం(Heavy Rains AP) నుంచి 16.61లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారు. కుండ పోత వర్షం తాకిడికి పోలవరం, ధవళేశ్వరం బ్యారేజ్ ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు.
వర్షాల దెబ్బకు కోనసీమ లంక వాసులతో పాటు విలీన మండలాలు, గ్రామాలు తల్లడిల్లుతున్నాయి. రాజమహేంద్రవరం జిల్లాలోని 8 మండలాలు, కోనసీమ లోని 18 మండలాలు 59 గ్రామాలు వరద నీటి ప్రభావానికి గురయ్యాయి.
ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ , ఒడిశా రాష్ట్రాలలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉప్పొంగుతోంది.
దాని ఉప నదులైన ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి, కడెం వాగు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదారి ప్రమాద స్థాయిని దాటింది.
గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో రాష్ట్ర సర్కార్ పోలవరం ప్రాజెక్టు వద్ద హై అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు చోట్ల ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో సీఎం సహాయక చర్యలపై ఆరా తీశారు.
ఎక్కడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. సీఎస్ ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేస్తున్నారు.
Also Read : గోదావరి ఉగ్ర రూపం ఏపీ అప్రమత్తం