Godavari Flow : భారీ వర్షం గోదావరి ఉగ్రరూపం
భద్రాచలం నీటి మట్టం 39.4 అడుగులు
Godavari Flow : బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాలలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. బారీ వర్షాల దెబ్బకు కాలువలు, చెరువులు, కుంటలు, ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులు నిండు కుండల్నితలపింప చేస్తున్నాయి.
Godavari Flow High
ఏపీలోని గోదావరికి భారీ ఎత్తున వరద(Godavari Flow) నీరు చేరుతోంది. ప్రమాద స్థాయికి చేరుకుంది. గోదావరి తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 39.4 అడుగులకు చేరుకుంది. పోలవరం వద్ద 11.4 మీటర్లకు నీటి మట్టం పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 6.84 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది.
ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణంగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంత వాసులను పునారావస శిబిరాలకు చేర్చుతున్నారు. మరో వైపు చేపల కోసం వేటకు వెళ్లే మత్స్యకారులు కొన్ని రోజుల పాటు వెళ్ల వద్దంటూ హెచ్చరించారు ఏపీ రాష్ట్ర విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్.
Also Read : Sanjay Singh AAP : వర్షంలోనే ఎంపీ సంజయ్ నిరసన