Heavy Rains : కురుస్తున్న వర్షాలు తప్పని కష్టాలు
కుండ పోత తప్పని గుండె కోత
Heavy Rains : నైరుతి రుతుపవనాల దెబ్బకు దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. గుజరాత్, తెలంగాణ, తదితర రాష్ట్రాలన్నీ వర్షాల తాకిడికి తల్లడిల్లుతున్నాయి.
ఇదే సమయంలో ఢిల్లీలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవ్ సారిలో భారీ వర్షాల కారణంగా పూర్ణా నదికి సమీపంలో వరదలు పోటెత్తాయి.
ఇదిలా ఉండగా తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని, రానున్న మూడు రోజుల పాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో రంగంలోకి దిగారు సీఎం కేసీఆర్.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇదిలా ఉండగా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 24 గంటల పాటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని(Heavy Rains) వాతావరణ శాఖ అంచనా వేసింది.
నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గోదావరి, ప్రాణ హిత ఉగ్రరూపం దాల్చాయి. రానున్న ఐదు రోజులలో డాంగ్ , నవ్ సారీ, వల్సాద్, తాపి , సూరత్ లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
ఇక గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో ఖమ్మం జిల్లా భద్రాచలం చుట్టూ నీళ్లు చేరాయి. ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి పువ్వాడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నారు సీఎస్.
Also Read : గుజరాత్ లో భారీ వర్షాలు.. రోడ్లు చెరువులు అయ్యాయి