Supreme Court : టీవీ యాంక‌ర్ల‌పై గురుత‌ర బాధ్య‌త

స్ప‌ష్టం చేసిన స‌ర్వోన్న‌త న్యాయ స్థానం

Supreme Court : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్ర‌సార మాధ్య‌మాల (టీవీలు)కు సంబంధించి యాంక‌ర్లపై గురుత‌రమైన బాధ్య‌త ఉంద‌ని పేర్కొంది.

ద్వేష పూరిత ప్ర‌సంగాల‌ను నిరోధించ‌డ‌మే ప్ర‌యోక్త‌లపై ఉంద‌ని వెల్ల‌డించింది. తాము ప్ర‌తి రోజూ నిర్వ‌హించే షోలు (కార్య‌క్ర‌మాలు, చ‌ర్చ‌లు ) విద్వేష పూరిత ప్ర‌సంగాల‌కు దిగ‌కుండా ప‌ర్య‌వేక్షించ‌డంలో టీవీ యాంక‌ర్ల పాత్ర అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు.

ప్ర‌ధాన స్ర‌వంతిగా ఉన్న ఎల‌క్ట్రానిక్ మ‌డియా, సోష‌ల్ మీడియాలో ప్ర‌సారం అయ్యే కంటెంట్ ను చాలా వ‌ర‌కు నియంత్రించేందుకు ఆస్కారం ఉండ‌ద‌ని పేర్కొంది.

టీవీల్లో ద్వేష పూరిత ప్ర‌సంగాల‌కు నిరోధించ‌డం యాంక‌ర్ల విధి అని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. జ‌స్టిస్ కె. ఎం. నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం జోసెఫ్ టీవీలో మేము ద్వేష పూరిత ప్ర‌సంగాల‌ను, చ‌ర్చ‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం లేదంటూ తెలిపింది.

దీనిని స‌వాల్ చేస్తూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఎల‌క్ట్రానిక్ మీడియాలో విద్వేషాలు రెచ్చ‌గొడుతూ ప్ర‌భుత్వం మూగ ప్రేక్ష‌కుడిగా ఎందుకు కొన‌సాగుతోంద‌ని కోర్టు(Supreme Court)  ప్ర‌శ్నించింది.

ద్వేష పూరిత ప్ర‌సంగాల వ‌ల్ల అనేక అన‌ర్థాలు చోటు చేసుకుంటున్నాయ‌ని హెచ్చ‌రించింది. కేసుకు సంబంధించి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 23కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

2021 జ‌న‌వ‌రిలో అప్ప‌టి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎస్.ఎ. బాబ్డే హింస‌, అల్ల‌ర్లు వ్యాప్తి చెంద‌కుండా నిరోధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. తాజాగా కోర్టు చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపింది.

Also Read : నీరా రాడియా టేప్‌లపై సుప్రీం ఆదేశం

Leave A Reply

Your Email Id will not be published!