MLA Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకమాండ్ షాక్
10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
MLA Raja Singh : ఇది ఊహించని పరిణామం. గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ హైకమాండ్. ఆయనను 10 రోజుల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించ కూడదో వివరణ ఇవ్వాలని కోరింది. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్(MLA Raja Singh) పై పలు కేసులు నమోదవుతున్నాయి.
దీంతో ముందు జాగ్రత్తగా హై కమాండ్ దిద్దుబాటు చర్యకు దిగింది. ఇప్పటికే నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ దేశానికి , ప్రధానంగా బీజేపీకి డ్యామేజ్ ఏర్పడింది. పలు దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
చివరకు ఆమెను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ తరుణంలో ఎవరూ పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించ కూడదంటూ ఆదేశించింది.
ఇదిలా ఉండగా ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ హైదరాబాద్ కు రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు రాజా సింగ్. ఆయన గనుక వస్తే షో నిర్వహించే హాల్ ను ధ్వంసం చేస్తామని, తగల బెడతామని హెచ్చరించారు.
గతంలో కూడా ఇదే కామెంట్స్ చేశారు. దీంతో తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. భారీ భద్రత మధ్య ఫారూఖీ షో పూర్తయింది. ఇదే సమయంలో ప్రవక్తపై సీరియస్ కామెంట్స్ చేశారంటూ ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.
దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్ట్ చేశారు. దీంతో హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజా సింగ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : రాజకీయ లబ్ది కోసమే బీజేపీ రెచ్చగొడుతోంది