Thalapathy Car Case : విజయ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు
ఎంట్రీ టాక్స్ చెల్లించక పోతే జరిమానా కట్టాల్సిందే
Thalapathy Car Case : తమిళనాడు సినీ రంగంలో మోస్ట్ పాపులర్ హీరోగా పేరొందారు ఇలయ తళపతి విజయ్. లక్షలాది మంది అభిమానులను కలిగిన ఈ హీరో ఉన్నట్టుండి కోర్టుకు ఎక్కారు.
అదీ ప్రజల కోసం అనుకుంటే పొరపాటు పడినట్లే. తాను కొనుగోలు చేసిన కారుకు సంబంధించి ఎంట్రీ టాక్స్ చెల్లించాలంటూ నోటీసులు అందుకున్నారు.
దీనిని సవాల్ చేస్తూ నటుడు విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన తీర్పు వెలువరించింది కోర్టు. 2019 జనవరి నాటికి ఎంట్రీ టాక్స్ చెల్లించి ఉంటే పర్వాలేదు.
కానీ చెల్లించక పోయినట్లయితే జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేసింది హైకోర్టు. ఈ కేసుకు సంబంధించి తళపతి విజయ్ 2005 సంవత్సరంలో రూ. 63 లక్షలు ఖర్చు చేరి కారును(Thalapathy Car Case) కొనుగోలు చేశారు.
కానీ ఆ కారు ఇండియాలో కొనుగోలు చేయలేదు. విదేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ వాహనానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో తిరగాలంటే ప్రభుత్వ రవాణా శాఖకు ముందస్తుగా ఎంట్రీ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
కాగా ఈ కారుకు సంబంధించి నటుడు విజయ్ కావాలని ఎంట్రీ టాక్స్ చెల్లించలేదంటూ రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో అది సంచలనంగా మారింది.
ఈ మేరకు వెంటనే ఎంట్రీ టాక్స్ చెల్లించాలంటూ విజయ్ కి నోటీసులు జారీ చేశారు. ఇది వివాదానికి దారి తీసింది. నోటీసులు ఎందుకు ఇస్తారంటూ మనోడు కోర్టును ఆశ్రయించాడు.
తాను దాఖలు చేసిన పిటిషన్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది. తన కారుకు 2 శాతం జరిమానా చెల్లించాల్సి ఉండగా తన కారుకు 40 శాతం జరిమానా విధించారని ఆరోపించాడు.
Also Read : పెళ్లి చేసుకోలేదు కానీ ప్రేమలో ఉన్నాం