High Court: బీరు తాగుతూ వాదనలు వినిపించిన న్యాయవాది

బీరు తాగుతూ వాదనలు వినిపించిన న్యాయవాది

High Court : బీరు తాగుతూ క్లయింట్‌ తరఫున వర్చువల్‌ గా వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాదిపై గుజరాత్‌ హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. జూన్‌ 26న న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ భట్‌ ధర్మాసనం ఓ కేసులో విచారణ జరుపుతుండగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది భాస్కర్‌ తన్నా వర్చువల్‌ గా హాజరయ్యారు. చేతిలో మగ్గుతో బీరు సేవిస్తూనే ధర్మాసనానికి ఆయన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన ప్రవర్తనను కోర్టు ధిక్కరణగా భావించి సుమోటోగా స్వీకరిస్తున్నట్లు గుజరాత్‌ హైకోర్టు (High Court) న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎస్‌.సుపేహియా, జస్టిస్‌ ఆర్‌.టి.వచ్చానీల ధర్మాసనం తాజాగా ప్రకటించింది.

High Court Serious Trail

భాస్కర్‌ కు ఉన్న సీనియర్‌ న్యాయవాది హోదాను పునఃపరిశీలిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి తమ ఎదుట వర్చువల్‌ గా వాదనలు వినిపించడానికి కుదరదని తెలిపింది. రెండు వారాల తర్వాత ఈ కేసులో వాదనలు వింటామని, ఆలోగా భాస్కర్‌ శైలిపై సమగ్ర నివేదికను సిద్ధంచేసి సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీనితోపాటు వర్చువల్‌ విచారణ వేళ అభ్యంతరకర ప్రవర్తనపై భాస్కర్‌ ను హైకోర్టు వివరణ కోరింది. వారం క్రితం మరో వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో ఓ వ్యక్తి టాయిలెట్‌ సీటుపై కూర్చొని గుజరాత్‌ హైకోర్టు ఎదుట వర్చువల్‌ విచారణకు హాజరయ్యాడు.

Also Read : Amarnath Yatra: కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!