High Court: కేటీఆర్ పై నమోదైన డ్రోన్ ఫ్లయింగ్ కేసుపై హైకోర్టు విచారణ
కేటీఆర్ పై నమోదైన డ్రోన్ ఫ్లయింగ్ కేసుపై హైకోర్టు విచారణ
High Court : అనుమతి లేకుండా మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటించడంతో పాటు డ్రోన్ ఎగురవేసారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును తెలంగాణా హైకోర్టు(High Court) విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా… డ్రోన్ ఎగురవేశారని అనడాని ఎలాంటి ఆధారాలూ లేకుండా మహదేవ్‍పూర్ పోలీసులు కేటీఆర్ పై అక్రమంగా పెట్టారని… ఈ కేసును కొట్టివేయాలంటూ అతని తరపు న్యాయవాది కోర్టును హైకోర్టుకు తెలిపారు.
డ్రోన్ ఎగురవేశారని అనడానికి ఎలాంటి సాక్ష్యాలూ లేవని… ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్లు అర్థం అవుతోందని… కాబట్టి ఈ మేరకు నమోదైన ఎఫ్ఐఆర్‍ను వెంటనే కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి మేడిగడ్డ ప్రాజెక్టు ఎంతో కీలకమని హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. మేడిగట్ట బ్యారేజ్ నిషిద్ధ ప్రాంత జాబితాలో ఉందని, అనుమతి లేకుండా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి డ్రోన్ ఎగురవేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీని వల్ల డ్యాం భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పీపీ చెప్పుకొచ్చారు. ఇరువర్గాల వాదనలూ విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.
High Court – KTR Cases
మేడిగడ్డ కుంగిపోవడంపై గతేడాది పెద్దఎత్తున రాజకీయ రగడ చెలరేగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ గతేడాది జులై 16న మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. డ్యాం పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రోన్ ఎగరవేశారంటూ కేటీఆర్‍పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మహదేవ్‍పూర్ పోలీసులు కేటీఆర్ తో పాటు అతని అనుచరులతో అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేసినందుకు వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.
Also Read : Rajnath Singh: డీలిమిటేషన్ తో సీట్ల సంఖ్య మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి రాజ్‌నాథ్