AP Assembly Tension : ఏపీ అసెంబ్లీలో కిష్కింద‌కాండ

వైసీపీ..టీడీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ

AP Assembly Tension : ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. సోమ‌వారం ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే రాష్ట్ర స‌ర్కార్ జారీ చేసిన జీవో నెంబ‌ర్ వ‌న్ ర‌ద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఎంత‌గా న‌చ్చ చెప్పినా ప‌ట్టించు కోలేదు స‌భ్యులు.

చివ‌ర‌కు ఎమ్మెల్యేలు స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స‌భ‌ను జ‌ర‌గ‌కుండా అడ్డుకున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు స‌భకు అంత‌రాయం క‌లిగించ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు.

టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడును, టీడీపీ స‌భ్యుల తీరును నిర‌సిస్తూ తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. దీంతో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజ‌నేయ స్వామి , వైసీపీ ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబు మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగింది.

ఓ ద‌శ‌లో ఒక‌రిపై మ‌రొక‌రు దాడికి దిగిన‌ట్లు స‌మాచారం. స‌భ్యులను కంట్రోల్ చేసేందుకు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం చివ‌రి దాకా ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఎమ్మెల్యేలు ప‌ట్టించు కోకుండా ముందుకు సాగ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో స్పీక‌ర్ వాయిదా(AP Assembly Tension) వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతే కాకుండా స‌భ‌కు సంబంధించి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కాకుండా నిలిపి వేశారు. అక్క‌డి నుంచి సీరియ‌స్ గా త‌మ్మినేని సీతారాం వెళ్లి పోయారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కోలుకోలేని షాక్ త‌గిలింది అధికారంలో ఉన్న వైఎస్సార్ పార్టీకి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థులు గెలిచారు. ఇక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష టీడీపీకి చెందిన ముగ్గురు అభ్య‌ర్థులు గ్రాండ్ విక్ట‌రీని సాధించారు.

Also Read : ఎమ్మెల్సీ క‌విత..బుచ్చిబాబుపై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!