MLC Kvitha Himanshu : అత్తతో అల్లుడు అదుర్స్
నెట్టింట్లో హిమాంశు కవిత వైరల్
MLC Kvitha Himanshu : బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేటీఆర్ తనయుడు హిమాంశు(Himanshu) అంటే వల్లమాలిన అభిమానం. అంతకు మించిన ప్రేమ కూడా. ఇదే సమయంలో కూతురు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అంటే సీఎంకు పంచ ప్రాణం. మరి ఈ ఇద్దరూ ఒకే చోట కలుసుకుంటే ఎలా ఉంటుంది. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో.
అన్న కొడుకు అల్లుడు హిమాంశు అత్త కల్వకుంట్ల కవిత కలుసుకున్నారు. ఇంట్లో ఎప్పుడూ ముచ్చటించినా బయట కలుసు కోవడం మాత్రం అరుదు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు పలకరించు కోవడం చూసిన వారికి చాలా ఆనందం కలిగించింది.
హిమాంశు ఇటీవల యాదాద్రిని దర్శించుకున్నారు. ఇక కల్వకుంట్ల కవిత కాలికి గాయం కావడంతో చికిత్స నుంచి కోలుకున్నారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెండు సార్లు సీబీఐ మెట్లు ఎక్కారు. ఆపై తాను మహిళనని, సీబీఐ తనను వేధింపులకు గురి చేస్తోందంటూ , తన విచారణను ఆపాలంటూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.
ఏమైందో ఏమో కానీ తనకు ఆరోగ్యం బాగో లేదని కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఇటీవల పార్టీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంటున్నారు. సాహిత్య వేదికలో పాలు పంచుకున్నారు. మొత్తంగా అత్త కవిత అల్లుడు హిమాంశు ఫోటోలు వైరల్ గా మారడం విశేషం.
Also Read : Odisha Train Accident