Hindenburg Adani Group : హిండెన్‌బర్గ్ దెబ్బ అదానీ అబ్బా
రూ. 85, 000 కోట్లు ఆవిరి
Hindenburg Adani Group : ఒకే ఒక్క నివేదికకు సంబంధించిన కీలక ప్రకటన ఏకంగా వేల కోట్లను హరించి వేసేలా చేసింది. భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని కుబేరుల జాబితాలో టాప్ లో ఉన్న అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతం అదానీకి ఇది ఊహించని దెబ్బ(Hindenburg Adani Group). ఈ రకంగా షాక్ వస్తుందని ఆయన కలలో కూడా అనుకుని ఉండరు. స్టాక్ మార్కెట్ అంటేనే కేవలం నమ్మకాలు, ప్రచారం మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే సంఖ్యలను తాను నమ్మనని కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటానని ప్రకటించారు గౌతం అదానీ. ఇదేమో కానీ అమెరికాకు చెందిన నాథన్ ఆండర్సన్ నేతృత్వంలోని హిండెన్ బర్గ్ రీసెర్చ్ కొట్టిన దెబ్బకు ఫ్యూజులు ఎగిరి పోయేలా చేశాయి. ఏకంగా రూ. 85 వేల కోట్ల నష్టం జరిగేలా చేసింది.
ఇదంతా తమ సంస్థపై బురద చల్లేందుకు చేసిన ప్రయత్నంగా కొట్టి పారేసింది. ఆపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు గాను అమెరికా కోర్టులో దావా వేస్తామని ప్రకటించింది అదానీ గ్రూప్ . కాగా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు హిండెన్ బర్గ్ చీఫ్ నాథన్ ఆండర్సన్.
ఒకవేళ దావా వేస్తే చట్ట పరమైన ఆవిష్కరణ ప్రక్రియలో పత్రాలను డిమాండ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఏకంగా 36 కంపనీల లావాదేవీలను, అవి చేసే మోసాలను బహిర్గతం చేసింది. సంచలనంగా మారింది. ఇక అదానీ గ్రూప్ ఎలా తప్పుడు లెక్కలతో మోసం చేస్తుందో వివరాలు బయటకు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి నాథన్ ఆండర్సన్ సంచలన ప్రకటన చేశాడు. తాము అదానీ గ్రూప్ నకు సంబంధించి విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు సంస్థ ప్రస్తావించ లేదని పేర్కొన్నారు. మొత్తంగా హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు అదానీ అబ్బా అనక తప్పలేదు.
Also Read : హిండెన్‌బర్గ్ కథేంటి ఆండర్సన్ ఎవరు