Hindu Marriage: పుణెలో భారీవర్షం ! ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంట పెళ్లిళ్ళు !
పుణెలో భారీవర్షం ! ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంట పెళ్లిళ్ళు !
Hindu Marriage : ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం, మతసామరస్యాన్ని ప్రతిబింబిస్తూ… మహారాష్ట్రలోని పుణెలో(Pune) అరుదైన ఘటన జరిగింది. అనుకోకుండా కురిసిన భారీవర్షం కారణంగా హిందూ(Hindu), ముస్లిం మతాలకు చెందిన రెండు వివాహ వేడుకలు ఒకే వేదికపై నిర్వహించారు. దీనితో ఈ పెళ్లిళ్ళు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంటలు పెళ్లి చేసుకోవడంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ రెండు జంటలు, వారి బంధువులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….
గత రాత్రి వనవాడీ ప్రాంతంలో ఉన్న బ్యాంకెట్ హాలులో ముస్లిం జంట వివాహ రిసెప్షను జరుగుతుండగా, ఆ పక్కనే ఆరుబయట పచ్చికబయలులో హిందూ కుటుంబం పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకొంది. వధూవరులు సంస్కృతి, నరేంద్ర పెళ్లి మండపానికి చేరుకున్న వెంటనే భారీవర్షం కురిసి ఆ ప్రాంతమంతా జలమయమైంది. అతిథులతోపాటు అందరూ తడిసిపోయారు. ఇక వివాహ వేడుకను ఎలా పూర్తిచేయాలనే ప్రశ్న అందరిలో తలెత్తింది. వరుడి తండ్రి చేతన్ కవాడే పక్కనే బ్యాంకెట్ హాలులో జరుగుతున్న ముస్లిం జంట రిసెప్షను వద్దకు వెళ్లి సాయం కోరారు. ఆ కుటుంబ పెద్ద ఫరూఖ్ ఖాజీ బంధువులతో చర్చించి, గంటన్నరసేపు వేదికను ఖాళీ చేసి హిందూ జంటకు కేటాయించారు. సంస్కృతి, నరేంద్రల పెళ్లి అనుకున్న ముహూర్తానికే పూర్తయింది. అనంతరం ఒకే వేదికపై రెండు జంటలు నిలబడి అతిథుల ఆశీస్సులు తీసుకొంటూ అందరికీ కనులపండువ చేశాయి.
Hindu Marriage – నాకు లవర్ ఉన్నాడంటూ పెళ్లి పీటలపై వధువు మొండిపట్టు
సినిమాలో మాదిరిలో తాళి కట్టే సమయంలో ఆటంకం ఏర్పడింది, వధువు ఈ పెళ్లి(Marriage)చేసుకోనని మొండికేయడంతో వరునితో సహా అందరూ అవాక్కయ్యారు. హాసన్ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆదిచుంచనగిరి కళ్యాణ మంటపంలో పల్లవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాల్ అనే వధూవరులకు ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. అన్నిశాస్త్రాలను పూర్తి చేశారు. వధూవరులను పెళ్లి వేదికపై తీసుకొచ్చి మాంగళ్య ధారణ పూర్తి చేసే సమయంలో వధువు ఈ పెళ్లి వద్దని స్పష్టంచేసింది. వేరే యువకున్ని ప్రేమిస్తున్నాను, అతనినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి, తన గదిలోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు బుజ్జగించారు, పోలీసులకు తెలిసి వారు కూడా వచ్చి రాజీ చర్చలు చేశారు. కానీ పెళ్లికూతురు మెట్టు దిగలేదు.
ఇంత జరగడంతో వరుడు వేణుగోపాల్‌కు కూడా అవమానం జరిగినట్లు కావడంతో ఈ వివాహం చేసుకోనని చెప్పేశాడు. ఈ పరిణామాలతో వధువు తల్లిదండ్రులు ఎంతగానో విలపించినా పల్లవి మనసు కరగలేదు. ఆమె ప్రేమ విషయం తెలియదు. తెలిసి ఉంటే పెళ్లిని కుదిర్చేవాళ్లమే కాదు అని బంధువులు తెలిపారు. తల్లిదండ్రులు షాక్‌లో ఉండటం వల్ల ఏమి మాట్లాడలేక పోతున్నారు. లక్షలాది రూపాయలను పెళ్లికి ఖర్చు చేశారు. అన్ని రకాలుగా నష్టపోయారు. ఇక పెళ్లికొడుకు వారు కూడా బాగా వ్యయం చేశారు, ఆ మొత్తం పెళ్లికూతురు కుటుంబం నుంచి ఇప్పించాలని పోలీసులను కోరారు. పరువు తీశావు కదే అని బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు.
Also Read : Rahul Gandhi: పూంఛ్ సెక్టార్ లోరాహుల్ గాంధీ పర్యటన ! పాక్ దాడుల బాధితులకు పరామర్శ !