Siddaramaiah : హిందూత్వం రాజ్యాంగానికి వ్యతిరేకం
సిద్దరామయ్య కామెంట్స్ కలకలం
Siddaramaiah : కన్నడ నాట రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది.
కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఎన్నికల క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు. బీజేపీ దూసుకు పోతుంటే మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్రను ఇప్పటికే ప్రారంభించింది. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను హిందూ వ్యతిరేకి కానని హిందుత్వకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. హిందుత్వం అంటే హింసకు, హత్యలకు , దగాకు కేరాఫ్ అంటూ మండిపడ్డారు. హిందుత్వ వర్సెస్ హిందూ రిమార్క్ తో తీవ్ర దుమారం రేపారు సిద్దరామయ్య. హత్యలకు హింసకు ఏ మతం మద్దతు ఇవ్వదన్నారు. హిందుత్వ, మనువాదాలు, హత్యలు, హింస, వివక్షలను సమర్థిస్తున్నాయని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి. హిందూత్వం రాజ్యాంగానికి విరుద్దమని పేర్కొన్నారు.
హిందూత్వంపై ఇదే మొదటిసారి కాదు..గతంలో కూడా సిద్దరామయ్య (Siddaramaiah) ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత నెల జనవరి 8న తాను హిందువునని , కానీ హిందూత్వం పేరుతో జరిగే తతంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు మాజీ సీఎం. కర్ణాటక పశు సంవర్దక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ పై దాడిన ప్రారంభిస్తారు.
ఈ మంత్రికి కన్నడతో సహా ఏ భాషలు రావు. మిగతా వారి పట్ల కూడా ఎలాంటి ప్రేమ అన్నది లేదని మండిపడ్డారు. బీజేపీ నాయకులు ప్రతి ఎమ్మెల్యేకు రూ. 15 నుండి రూ.20 కోట్లు చెల్లించాలరని , ఆపరేషన్ కమలం ద్వారా యెడ్డీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు సిద్దరామయ్య.
Also Read : కొత్త వారికి అవకాశం ఇవ్వాలి