Hindupur: హిందూపురంలో బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత

హిందూపురంలో బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత

 

 

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మ భూషణ్ అవార్డు అందుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు సన్మానం చేయడానికి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హిందూపురంలో ఏర్పాట్లు చేసారు. అయితే బాలకృష్ణ సన్మానం కోసం… టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించిన వైఎస్సార్ స్థూపం తొలగించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. దీనితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ… ఇటీవల రాష్ట్రపతి చేతులమీదుగా పద్మభూషణ్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. దీనితో ఎమ్మెల్యే బాలకృష్ణకు పార్టీ కార్యకర్తలు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హిందూపురం రహమత్ పూర్ సర్కిల్‌లో వైఎస్సార్ అమర్ రహే స్థూపాన్ని అధికారులు, టీడీపీ కార్యకర్తలు కలిసి తొలగించారు. అక్కడ బాలకృష్ణ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. దీనితో రహమత్ పూర్ సర్కిల్‌ లో వైఎస్సార్ స్థూపం తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హిందూపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి.. రహమత్‌ పూర్‌ సర్కిల్‌ లో బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు… వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీనితో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో… కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

 

Leave A Reply

Your Email Id will not be published!