Tirumala Rush : పోటెత్తిన భ‌క్త‌జ‌నం భారీగా ఆదాయం

స్వామిని ద‌ర్శించుకున్న భ‌క్తులు 73,156

Tirumala Rush : క‌లియుగ దైవంగా పేరు పొందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు భ‌క్తుల తాకిడి పెరుగుతోంది. ప్ర‌తి రోజూ 72,000 వేల మందికి పైగా శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటున్నారు. గ‌త ఆదివారం ఏకంగా 92,000 వేల మందికి పైగా ద‌ర్శించు కోవ‌డం ఇటీవ‌లీ కాలంలో ఓ రికార్డు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉండ‌గా జూన్ 26న సోమ‌వారం ఊహించ‌ని రీతిలో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. ఏకంగా 73 వేల 156 మంది స్వామి , అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. ఇక మొక్కులు తీర్చుకునే భ‌క్తులు 28 వేల 175 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నార‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లి కాలంలో భారీగా తిరుమ‌ల హుండీ ఆదాయం పెరిగిన‌ట్లు తెలిపింది. భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాలు, కానుక‌లతో రూ. 4.29 కోట్లు స‌మ‌కూరిన‌ట్లు తెలిపింది. భ‌క్తులు స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లో 9 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తులు టోకెన్లు లేని వారికి క‌నీసం 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా సుదూర ప్రాంతాల నుంచి స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఏర్పాట్లు చేసింది.

Also Read : Ponguleti Jupally Join : జూప‌ల్లి..పొంగులేటి జంప్

Leave A Reply

Your Email Id will not be published!