TSPSC Paper Leak : పేపర్ లీక్ వ్యవహారం కలకలం
టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ గా గుర్తింపు
TSPSC Paper Leak : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. సదరు సంస్థ కంటిన్యూగా నోటిఫికేషన్లు ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్ -1 పరీక్ష కూడా నిర్వహించింది. ప్రిలిమినరీ అయి పోగా మెయిన్స్ ఇంకా నిర్వహించాల్సి ఉంది. ఆయా పరీక్షలకు సంబంధించి సిడీపీఓ, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ జాబ్స్ కు సంబంధించి టీఎస్పీఎస్సీ ఫలితాలు విడుదల చేసింది. మెరిట్ లిస్టు ప్రకటించాల్సి ఉంది.
మొన్నటికి మొన్న డీఏఓ ఎగ్జామ్ చేపట్టింది. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) వ్యవహారం బయట పడింది. ఓ యువతి కోసం సంస్థలో పని చేస్తున్న సెక్రటరీ పీఏ ప్రవీణ్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సదరు యువతి తరచుగా ఆఫీసుకు వచ్చి పోయేదని , ఓ రోజు పేపర్ ఇవ్వాలని కోరడంతో ప్రవీణ్ సదరు పేపర్ ను దొంగతనంగా ఇచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ నిర్వాకం వల్లనే యువతి వద్దకు చేరిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ హ్యాక్ అయ్యిందన్న వార్త గుప్పుమంది.
చివరకు పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు. ప్రవీణ్ కారణంగానే పేపర్ బయటకు వెళ్లిందని తేల్చారు. ఇక పరీక్షకు సంబంధించి మార్చి 12న జరగాల్సిన టీపీబీఓ రాత పరీక్ష 15, 16 తేదీల్లో చేపట్టాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాత పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
Also Read : ఏప్రిల్ 25 నుంచి బడులకు సెలవులు