Devendra Fadnavis : బిల్కిస్ దోషులకు సన్మానం దారుణం
మరాఠా ఉప ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్
Devendra Fadnavis : గుజరాత్ గోద్రా ఘటనలో భాగంగా బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెతో పాటు చిన్నారి కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురయ్యారు.
ఈ కేసుకు సంబంధించి 2008లో ప్రత్యేక కోర్టు ఈ దారుణ ఘటనలో పాల్గొన్న వారందరికీ యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. బాధితురాలికి రూ. 50 లక్షలతో పాటు ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని ఆదేశించింది.
కానీ ఇన్నేళ్లు గడిచాక దోషుల ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజున గుజరాత్ బీజేపీ ప్రభుత్వం 11 మందిని విడుదల చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
ఈ కేసుకు సంబంధించి శిక్ష ఖరారు చేసి తీర్పు వెలువరించిన ఆనాటి జడ్జి యుడి సాల్వే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇప్పటికీ తేరుకోలేక పోతున్నానని పేర్కొన్నారు.
మరో వైపు తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఏకంగా సోషల్ మీడియాలో దోషులకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు.
మరో వైపు 6 వేల మందికి పైగా మహిళలు, సంస్థలు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించారు. దోషులను వెనక్కి రప్పించాలని కోరారు.
ఈ తరుణంలో మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్(Devendra Fadnavis) సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్ బానో దోషులకు సన్మానం చేయడం, స్వీట్లు పంపిణీ చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు ఫడ్నవీస్. అలాంటి చర్యను తాను సమర్థించ లేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫడ్నవీస్ చేసిన కామెంట్స్ కాషాయంలో కలకలం రేపుతున్నాయి.
Also Read : బిల్కిస్ దోషుల విడుదలపై మాజీ జడ్డీ ఫైర్