S Jai Shankar : స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే ఎలా – జై శంకర్
ఖలిస్తాన్ కార్యకలాపాలపై ఫైర్
S Jai Shankar : ఖలిస్తాన్ కార్యకలాపాలపై సీరియస్ అయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. భారత దేశం శాంతిని కోరుకుంటుంది. విధ్వంసాన్ని, ప్రత్యేక వాదాన్ని, హింసను ఎన్నటికీ కోరుకోదని స్పష్టం చేశారు. అలా ఎవరు చేసినా వాటిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు.
స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తామంటే ఊరుకోబోమన్నారు . 13వ విదేశాంగ శాఖ మంత్రుల ఫ్రేమ్ వర్క్ డైలాగ్ లో ఆస్ట్రేలియన్ కౌంటర్ పెన్నీ వాంగ్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు ఎస్ జై శంకర్(S Jai Shankar). కాన్ బెర్రాలో సోమవారం జరిగిన ఈ మీట్ లో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కేంద్ర మంత్రి.
కెనడా నుండి ఒట్టావా వరకు పని చేస్తున్న ఖలిస్తానీ వేర్పాటు వాద శక్తులకు సంబంధించిన సమస్యలను భారత్ గమనిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుందని కానీ మితిమీరిన స్వేచ్ఛను ఇతర హింసా పద్దతులకు , వేర్పాటు వాద ధోరణులను పెంపొందించేలా చేస్తామంటే చూస్తూ ఉండి పోమన్నారు జై శంకర్(S Jai Shankar).
కెనడియన్ ప్రభుత్వంతో చర్చించడం జరిగింది. ఖలిస్తాన్ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానిని మేం పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశ సార్వభౌత్వానికి సంబంధించిన సమస్య. తమ దేశానికి సంబంధించిన ఏ అంశాన్ని ఇంకో దేశం జోక్యం చేసుకోకూడదని తాము భావిస్తామన్నారు. ఇదే విషయాన్ని కెనడాకు స్పష్టంగా చెప్పామన్నారు
సెప్టెంబర్ 15న టొరంటో లోని స్వామి నారాయణ్ మందిర్ ను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు జై శంకర్.
Also Read : ఇరాన్ డ్రోన్లను ఉపయోగించిన రష్యా