Sanjay Raut : భావోద్వేగాలు రెచ్చగొడితే బీజేపీకి లాభం – రౌత్
రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ ఆగ్రహం
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సిద్దాంతకర్త వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తున్న ఈ తరుణంలో భావోద్వేగాలను రేకెత్తించే సమస్యలను రాహుల్ గాంధీ ఎందుకు లేవనెత్తుతున్నారంటూ నిలదీశారు.
దీని వల్ల కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి ప్రశ్నించేందుకు, మరింత బల పడేందుకు ఎందుకు అవకాశం ఇస్తున్నారంటూ నిప్పులు చెరిగారు సంజయ్ రౌత్(Sanjay Raut). సావర్కర్ ను విమర్శించడం భారత్ జోడో యాత్ర ఉద్దేశం కాదన్నారు.
స్వాతంత్ర సమరయోధుడైన వీడీ సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మైలేజీ రాకుండా పోయిందన్నారు. సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఆయన శివసేన పార్టీకి చెందిన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పలు ప్రశ్నలను లేవదీశారు.
ప్రజలు ద్వేషాన్ని కోరుకోవడం లేదని, కేవలం స్నేహం మాత్రమే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut). దీని వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందే తప్ప ఇంకేమవుతుందన్నారు.
దివంగత హిందూత్వ సిద్ధాంతకర్త బ్రిటీష్ పాలకులకు సాయం చేశారని, భయంతో వారికి క్షమాభిక్ష పిటిషన్ ను రాశారని ఆరోపించారు. రాహుల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
రాహుల్ గాంధీ ఇప్పటి దాకా చేపట్టిన పాదయాత్రకు అర్థం లేకుండా పోయిందన్నారు సంజయ్ రౌత్.
Also Read : గవర్నర్ కామెంట్స్ రౌత్ సీరియస్