Tirumala Rush : తిరుమ‌ల క్షేత్రం భ‌క్త జ‌న సందోహం

రోజు రోజుకు పెరుగుతున్న భ‌క్తులు

Tirumala Rush : క‌లియుగ దైవం కొలువై ఉన్న తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది(Tirumala Rush). ఎక్క‌డ చూసినా భ‌క్తులే ద‌ర్శ‌నం ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ క‌రుణ క‌టాక్షాల కోసం విచ్చేశారు. భారీ ఎత్తున భ‌క్తులు రావ‌డంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్ల‌లో మునిగి పోయింది. ఎక్క‌డ కూడా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు టీటీడీ కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మారెడ్డి.

చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తిరుమ‌ల‌లో ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. సంతృప్తిని వ్య‌క్తం చేశారు. శ్రీ‌నివాసుడి ప్ర‌త్యేక రోజు శ‌నివారం కావ‌డంతో ఉన్న‌ట్టుండి భ‌క్తులు పోటెత్తారు. శుక్ర‌వారం రోజు 72 వేల మంది ద‌ర్శించు కోగా నిన్న ఒక్కో రోజు భ‌క్తుల సంఖ్య పెరిగింది. 83 వేల 889 మంది శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. స్వామి వారికి 40 వేల 495 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

ఇక భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాలు రూ. 3.10 కోట్లు వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. భ‌క్తులు భారీ ఎత్తున పెర‌గ‌డంతో కంపార్ట్ మెంట్ల‌కు అవ‌త‌ల కూడా భ‌క్తులు నిలిచి ఉన్నారు. టోకెన్లు లేకుండా స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వేచి ఉండే భ‌క్తుల భారీగా ఉంది. వీరంద‌రికి ద‌ర్శ‌నం స‌మ‌యం 24 గంట‌ల‌కు పైగా ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ తెలిపింది.

Also Read : Pedda Sesha Vahanam : శ్రీ‌నివాసుడి సాక్షాత్కార వైభ‌వోత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!