Tirumala : తిరుమ‌ల‌లో భ‌క్తుల రద్దీ

జూన్ 21న 77,120 మంది ద‌ర్శ‌నం

Tirumala : పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో భక్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. వేస‌వి సెల‌వులు ముగిసినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్నారు భ‌క్తులు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మారెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే టీడీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తుండ‌డం విశేషం.

స్వామి , అమ్మ వారిని ద‌ర్శించు కునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు త్వ‌ర‌గా ద‌ర్శ‌నం అయ్యేలా ఏర్పాట్లు చేశామ‌ని స్ప‌ష్టం చేసింది (TTD). ఇదిలా ఉండ‌గా బుధ‌వారం ఉన్న‌ట్టుండి భ‌క్తుల సంఖ్య పెరిగింది. జూన్ 21న 77 వేల 120 మంది శ్రీ‌నివాసుడిని ద‌ర్శించుకున్నార‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. 34 వేల 463 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు.

మొత్తం హుండీ కానుల ప‌రంగా రూ. 3.39 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. టోకెన్లు లేకుండా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన భ‌క్తులు తిరుమ‌ల లోని 21 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది. వీరికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌లిగేందుకు క‌నీసం 18 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట వ‌చ్చ‌ని తెలిపింది. కాగా సెల‌వులు ముగిసినా ఊహించ‌ని రీతిలో తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని కలిగిస్తోంది.

Also Read : Satya Pal Malik : అదానీ సొమ్మంతా ప్ర‌ధాని మోదీదే

Leave A Reply

Your Email Id will not be published!