TSRTC MD Sajjanar : లాజిస్టిక్ సేవలతో భారీ ఆదాయం – సజ్జనార్
ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడి
TSRTC MD Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు లాజిస్టిక్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్(TSRTC MD Sajjanar). ఇందుకు సంబంధించి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాము తీసుకు వచ్చిన మార్పుల కారణంగా గణనీయమైన ఆదాయం ఆర్టీసీకి సమకూరుతోందని చెప్పారు ఎండీ.
ఇందులో భాగంగా ఏఎం టు పీఎం, పీఎం టు ఏఎం అనే లాజిస్టిక్ ప్రొడక్ట్ లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్సిళ్లు మరింత త్వరగా అందేలా చేయడం. మధ్యాహ్నం 12 గంటలకు బుక్ చేస్తే రాత్రి 9 గంటలకు చేరుతుందన్నారు. రాత్రి 9 గంటలకు బుక్ చేస్తే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకునేలా ప్లాన్ చేశామని తెలిపారు ఎండీ సజ్జనార్.
ఒక కేజీ పార్సిల్ కు సర్వీస్ చార్జి కూడా తక్కువ ధరకు పంపించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు . ఇప్పటి వరకు ఆర్టీసీ సంస్థ తరపున 192 లాజిస్టిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 10 టన్నుల లోడ్ తీసుకు వెళ్లే వాహనాలు, ఓపెన్ వెహికిల్స్ ఉన్నట్లు వెల్లడించారు ఎండీ.
ఇప్పటి దాకా మరాఠా, ఏపీ, కర్ణాటకకు నడుస్తున్నాయని , గతంలో లేని విధంగా గణనీయమైన ఆదాయం సమకూరిందన్నారు. మొదటి ఏడాది రూ. 36 కోట్లు వస్తే రెండో ఏడాది 67.90 కోట్ల లాభం వచ్చిందని చెప్పారు సజ్జనార్(TSRTC MD Sajjanar).
ఈ ఏఎం పీఎం కార్యక్రమం వల్ల ఆర్టీసీ సంస్థకు మరింత ఆదాయం పెరగనుందని అభిప్రాయపడ్డారు ఎండీ సజ్జనార్.
Also Read : హిండెన్‌బర్గ్ దెబ్బ అదానీ అబ్బా