Tirumala : తిరుమల క్షేత్రం భక్తజన సందోహం
దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
Tirumala : తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. అసలే సెలవులు కావడం, ఇంకా బడులు పూర్తిగా తెరుచుకోక పోవడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చర్యలు చేపట్టింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ తో పాటు ఈవో ఏవీ ధర్మారెడ్డి సాధ్యమైనంత త్వరగా స్వామి వారి దర్శనం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఎక్కడ చూసినా గదులు నిండి పోయాయి. అన్నదాన సత్రాలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ లేదు. స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచి ఉన్నారు. మరో వైపు వృద్దులు, చిన్నపిల్ల ల తల్లులు నానా తంటాలు పడుతున్నారు. స్వామి కృప కోసం ఎంత కష్టమైనా సరే తప్పదని ఓర్చుతో నిరీక్షిస్తున్నారు.
గత కొన్ని రోజుల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రవాస భారతీయ భక్తులు తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలనంత భక్తులు వేచి ఉన్నారు తిరుమలలో. ఇదిలా ఉండగా రోజుకు 75 వేల మందికి పైగా స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. జూన్ 8 గురువారం కొద్దిగా తగ్గారు.
మొత్తం 70 వేల 160 మంది దర్శించుకున్నారు. 38 వేల 76 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. టోకెన్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది.
Durga Bai Deshmukh : ధీర వనిత ‘దుర్గా భాయ్’