Tirumala : పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట
ఆదివారం 86,181 మంది స్వామి దర్శనం
Tirumala : కలియుగంలో అరుదైన పుణ్య క్షేత్రంగా వినుతికెక్కింది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కొలువై ఉన్న ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం నానా తంటాలు పడుతోంది. గతంలో కరోనా సమయంలో కాస్తంత వెసులుబాటు కలిగింది. ఆ తర్వాత మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తజనం తిరుమలకు రావడం మొదలు పెట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామి, అమ్మ వార్ల కరుణ కటాక్షం కోసం తరలి వస్తుండడం ఈ మధ్య విపరీతంగా పెరిగింది.
వేసవి సెలవులు ముగియడం, బడులు, విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో భక్తులు తగ్గుతారని టీటీడీ(TTD) భావించింది. కానీ ఎక్కడా తగ్గడం లేదు. గత ఆదివారం 92 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇది ఓ రికార్డు . ఇక జూన్ 18న ఆదివారం భక్తుల సంఖ్య తగ్గలేదు. ఈ ఒక్క రోజే 86 వేల 181 మంది దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 30 వేల 654 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక దర్శనం కోసం వేచి ఉన్న వారి సంఖ్య బాగానే ఉంది. దాదాపు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఊన్నారు. వీరికి దర్శన సమయం 24 గంటలకు పైగా పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Also Read : Arvind Kejriwal : పేదరికం లేని దేశం కావాలి