Silver Wood : ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. సక్సెస్ ఉంటేనే ఈ ప్రపంచంలో గుర్తింపు ఉంటుంది. అపజయానికి ప్రయారిటీ ఉండదని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా సీరీస్ కోల్పోవడంతో దీనికి బాధ్యత వహించాల్సింది హెడ్ కోచ్ సిల్వర్ వుడ్(Silver Wood )కారణమంటూ వేటు వేసింది. అతడిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు అధికారికంగా ధ్రవీకరించింది. ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఇంగ్లండ్ జట్టు ఘోరమైన ప్రదర్శన చేసి దారుణంగా ఓటమి మూటగట్టుకుంది.
దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది క్రికెట్ వర్గాల్లో. అంతే కాకుండా సిల్వర్ వుడ్ ను నియమించడంలో కీలక పాత్ర పోషించిన ఎండీ ఆష్లే గిల్స్ సైతం తన పదవి నుంచి తప్పుకున్నాడు.
జో రూట్ స్కిప్పర్ గా ఉన్న ఇంగ్లండ్ జట్టు తాను రాణించినా నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు. ఈ తరుణంలో ఇంగ్లండ్ స్కిప్పర్ రూట్ , కోచ్ వుడ్ పై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి.
దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు తలనొప్పిగా మారింది. ఎండీ, హెడ్ కోచ్ లు వెళ్లి పోవడంపై క్లారిటీ ఇచ్చే ప్రయ్నతం చేయలేదు. ఇదిలా ఉండగా తనను తొలగించడంపై స్పందించాడు సిల్వర్ వుడ్(Silver Wood ).
జట్టుకు హెడ్ కోచ్ గా పని చేయడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. అద్భుతమైన ఆటగాళ్లతో కలిసి జర్నీ చేయడం మరిచి పోలేని అనుభూతిగా పేర్కొన్నారు. రెండేళ్ల పాటు ఈ ప్రయాణం కొనసాగింది.
ఆడిన ప్రతిసారీ విజయం వస్తుందన్న గ్యారెంటీ లేదన్నాడు.
Also Read : కరోనా కలకలంతో బీసీసీఐ పరేషాన్